District / State Meetings






ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... సెప్టెంబర్ 4 న జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాధన శిబిరం ఉదయం 9-30 గంటలకు రాష్ట్ర అధ్యక్షులు వారిచే పతాకావిష్కరణ వేదం, భజన తో 4 జిల్లాల సాధన శిబిరం జడ్చర్ల లో ప్రారంభమైనది. జడ్చర్ల సమితి కన్వీనర్ తొలిపలుకులచే మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు అందరికీ స్వాగత ఉపన్యాసం తో అందరికి ఆహ్వానం పలికారు. దాని కన్న ముందుగా పెద్దలంతా కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి, స్వామి పాదాల చెంత పుష్పాలను సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి. వెంకట్రావు గారు మాట్లాడుతూ సమితి యొక్క ప్రాధాన్యత చెబుతూ, పెద్దలు శ్రీ బులుసు సాంబమూర్తి గారు, శ్రీ అశోక్ రెడ్డి గారు, శ్రీ విష్ణువర్ధన్ రావు గారు శ్రీ రాంబాబు గారు శ్రీ రామారావు గారు, శ్రీ భాస్కర్ గారు , శ్రీ నరసింహులు గారు పలు అంశాల పై మనకు వివరించనున్నారు అని తెలియజేశారు. స్వామి చిరకాల భక్తులు శ్రీ బులుసు సాంబమూర్తి గారు, శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆవిర్భావం మరియు అనేక విషయాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ రాంబాబు గారు ఆధ్యాత్మిక సాధన, ఆర్ధిక క్రమ శిక్షణ, అనే అంశంపై వారి ఉపన్యాసము అందరికి హత్తుకొనే విధముగ తెలియజేశారు. శ్రీ రామారావు గారు బాలవికాస్ పుట్టుపూర్వోత్తరాలు, బాలవికాస్ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్, శ్రీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ సేవల ప్రాముఖ్యత సేవల అనుభవాలు గ్రామ సేవల గురించి వివరించారు. శ్రీ విష్ణువర్ధన్ గారు మాట్లాడుతూ, నవ సూత్ర నియమా వళిని మన మంతా ఆచరించాలని అనేక వక్తిగత అనుభవాలను వివరిస్తూ, స్వీయ పరివర్తన రావాలని ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ సేవస్ పర్సన్ శ్రీ నరసింహులు గారు గ్రామ సేవల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. శ్రీ భాస్కర్ గారు సాయి కనెక్ట్ అప్ గురించి సోదాహరంగా వివరించారు అనంతరం జిల్లా అధ్యక్షులు సూక్ష్మ ప్రసంగాలు గా తమ జిల్లా వివరాలు విజన్ 2025 గురించి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్టేట్ యూత్ కోఆర్డినేటర్ యన్. శ్రీ నాగరాజు గారు సమన్వయం గావించారు. చివరగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు గారు సమావేశపు ముగింపు ప్రసంగం లో సాధన క్యాంపు ల ప్రాముఖ్యత సమితి కన్వీనర్ బాధ్యత ,సమితి నిర్వర్తించవలసిన నియమాలు, సంస్థ గత విషయాలు అద్భుతంగా వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా పక్షాన, వక్తలుగా విచ్చేసిన వారందరికీ మరియు జిల్లా అధ్యక్షులకు స్వామి వారి ప్రేమగా ఒక శ్రీ సత్య సాయి పాదుకలు బహుకరించారు. ఈ శిభిరం లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తలు 300 పైగా పాల్గొన్నారు శ్రీ రమాకాంత్ జిల్లా ఆధ్యాత్మిక సమన్వయ కర్త గారు వందన సమర్పణ గావించారు మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. - Jai Sairam