Medical Camps


ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 06-08-22 శనివారం రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి గజ్వేల్ వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడకండ్ల విద్యార్థులకు ఉచిత మొబైల్ దంత వైద్య శిబిరం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 248 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 69 మంది విద్యార్థులకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇట్టి ఉచిత దంత వైద్య శిబిరంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర గ్రామసేవ మహా యజ్ఞం టీమ్ మెంబర్, రాష్ట్ర పూర్వపు బాలవికాస్ జాయింట్ కోఆర్డినేటర్, జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ , గజ్వేల్ సమితి కన్వీనర్ , సేవాదళ్ సభ్యులు , MPTC, SMC చైర్మన్, పాఠశాల అధ్యాపక బృందం, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న దంతవైద్యులకు, సాయి సాధకులకు, సేవాదళ్ సభ్యులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ,ఆ భగవానుని కృపా కటాక్షాలు సర్వదా మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ....సాయిరాం జై సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సిద్దిపేట జిల్లా తెలంగా