Service



ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్తులతో... శ్రీ సత్య సాయి సేవ సమితి గజ్వేల్ వారు ఈరోజు 03-08-2022 (బుధవారం) మన సత్యసాయి మందిరంలో ఆర్థిక పరిస్థితుల వలన వివాహం నిర్వహించుకోలేని ఒక జంటకు వివాహం నిర్వహించామని తెలుపుటకు సంతోషిస్తున్నాము... వివాహ కార్యక్రమంలో భాగంగా వారికి మంగళ సూత్రం, మట్టెలు, నూతన వస్త్రాలు , నిత్యవసర వస్తువులైన రైస్ కుక్కర్, మిక్సర్, స్టీల్ సామాను మొదలైనవి కానుకలుగా అందజేసి శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాలతో వచ్చిన బంధువులకు రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసి స్వామివారి సమక్షంలో వైభవంగా వివాహా మహోత్సవం జరిపించామని తెలుపుటకు సంతోషిస్తున్నాము ... ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ సేవా మహా యజ్ఞం టీమ్ మెంబర్ , పూర్వపు రాష్ట్ర బాలవికాస్ జాయింట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు , గజ్వేల్ కన్వీనర్, బూరుగుపల్లి కన్వీనర్, వర్గల్ కన్వీనర్, సమితి బాధ్యులు,మహిళా విభాగం సభ్యులు, సాయి బంధువులు పాల్గొన్నారు.... స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నూతన వధూవరుల పైన, ఈ కార్యక్రమానికి చేయూతనందించిన సాయి బంధువుల పైన, సేవలో పాల్గొన్నా సేవాదళ్ పైన సదా ఉండాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు- సిద్దిపేట జిల్లా జై సాయిరాం