ఈశ్వరాంబ వారోత్సవాలు ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి అయిన "ఈశ్వరమ్మ" గారి వర్ధంతి(మే 6 వ తేది) ని పురస్కరించుకొని ఏప్రిల్ 30 నుండి మే 6 వ తేదీ వరకు "ఈశ్వరాంబ వారోత్సవాలు" జరుపబడును. అందులో భాగంగా సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాలవికాస్ విభాగం, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో తేదీ 01-05-2022, ఆదివారం నాడు ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి: 1. ఉదయం 9.00 గంటలకు బాలవికాస్ పిల్లలచే ర్యాలీ 2. ఉదయం 10.00 గంటలకు యోగ 3. ఉదయం 10.30 గంటలకు తండూలార్చన 4. ఉదయం 11.00 గంటలకు ఆధ్యాత్మిక ఆటలు 5. ఉదయం 11.30 గంటలకు డ్రాయింగ్ కాంపిటీషన్ పాల్గొన్న పిల్లలకు ఉదయం అల్పాహారం మరియు కార్యక్రమానంతరం భోజన ప్రసాదం అందించబడింది. ఇట్టి కార్యక్రమంలో బాలవికాస్ గురువులు , బాలవికాస్ పిల్లలందరూ, అలాగే భక్తులు వారి పిల్లలతో పాల్గొన్నారు. ఆ సాయి నాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరిపై నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల