*శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల* వారిచే *జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, జగిత్యాల* యందు నిర్వహింపబడుతున్న *శ్రీ సత్యసాయి నిత్యాన్నదానము * (పేషెంట్స్ సహాయకులకు ప్రతిరోజు *ఉచిత భోజన సేవ*) నకు ఈ రోజు *మన జగిత్యాల శాసన సభ్యులు (MLA)* *శ్రీ డా. సంజయ్ కుమార్ గారు* విచ్చేసి అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. అలాగే *ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ డా. సదామోహన్ * గారు కూడా వారి వెంట పాల్గొన్నారు . గతంలో ఎన్నో సార్లు వారు వచ్చినప్పటికీ MLA గ ఎన్నికైన తర్వాత మొదటిసారి రావడం ఆనందంగా ఉందని తెలిపారు , వచ్చిన నారాయణులకు అన్న ప్రసాదాన్ని వారు స్వయంగా వడ్డించి , స్వామికి హారతి సమర్పించి వెళ్లడం జరిగింది . సత్యసాయి సేవా సంస్థ తరపున వారికి బాబా జ్ఞాపికతో చిరు సత్కారం చేయడం జరిగింది. జై సాయిరాం