Service


భగవాన్ శ్రీ సత్యసాయి బాబావరి దివ్యశీస్సులతో.. పెద్దపల్లి జిల్లాలోని శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని నందు ఒక ఆడపడుచు పెళ్లికి చేయుతనందించబడినది. భగవాన్ బాబావారి ఆశీస్సులు కోరి వచ్చిన స్థానిక ఆడపడుచుకు స్వామివారి ఆశీర్వచనముగా నిన్న జరిగిన పెళ్లికి గోదావరిఖని సమితి సభ్యులచే పెళ్లికి కావలసిన నూతన సామానులు సుమారు 16000రూ.లు విలువగల నూతన బోళ్ళు అందించినారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, గోదావరిఖని సమితి కన్వీనర్, భక్తులు 4గురు పాల్గొన్నారు. ఈ సేవాభాగ్యం మాకు కల్పించినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సదా సాయిసేవలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా