ఓం శ్రీ సాయిరాం, 23 నవంబర్ నాడు భగవానుని 96వ పుట్టినరోజు పండుగను పురస్కరించుకొని, ఆ సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, జగిత్యాల జిల్లా యువజన విభాగం వారి ఆధ్వర్యంలో తేదీ 21.11.2021, ఆదివారం నాడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు యందు సాయి యువత చే రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులందరికి స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో, జిల్లా యువజన బాధ్యులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, జగిత్యాల జిల్లా