Service

ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భారతదేశ వ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవాసంస్థలు రక్త ధాన శిబిరాన్ని తేదీ 21.11.2021 ఆదివారం రోజున నిర్వహించుకుంటున్నందున, మన రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకు మన సిద్దిపేట జిల్లాలో కూడా యువజన విభాగం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజవంతంగా నిర్వహించుకొవడం జరిగింది.ఈ కార్యక్రమంలో 35 మంది రక్తదాతలు రక్తాన్ని దానం చేయగా వాటిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి యెక్క బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ అయిన శ్రీమతి అరుణ గారు,స్థానిక కౌన్సిలర్ యోగీశ్వర్ గారు, జిల్లా అధ్యక్షులు,జిల్లా పదాధికారులు ,జిల్లా యువజన విభాగం వారు మరియు సమితి కన్వీనర్లు పాల్గొనడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ అరుణ గారు ,ఆసుపత్రికి వాటర్ ఫిల్టర్ యొక్క అవసరాన్ని తెలియజేయగా,వారి విజ్ఞప్తి మేరకు శ్రీ సత్యసాయి సేవాసమితి సిద్దిపేట వారు వాటర్ ఫిల్టర్ ను అందచేయడం జరిగింది. రక్తదాతలుగా ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ వారిపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరిపైన ఆ భగవానుని కృపా కటాక్షాలు సర్వదా ఉండాలని ప్రార్ధిస్తూ. జై సాయిరాం. సదా సాయి సేవలో, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సిద్ధిపేట జిల్లా.