Pujas & Vrathams




ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అపార కృప అనుగ్రహ ప్రేమాశీస్సు లతో రంగారెడ్డి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ద్వారా Dec 2020 నుండి 2025 Nov వరకు జరుపుకునే స్వామివారి (100 వ జన్మదిన) శత జయంతి ఉత్సవాల వేడుకలలో ఆధ్యాత్మిక కార్యక్రమము లో భాగంగా 100 సార్లు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖం చేయాలనే సత్సంకల్పం. అందులో భాగంగా తేదీ 29-08-2021 అదివారం నాడు వేద పండితులచే ,మరియు వేదము పఠించే మన సాయి కుటుంభ సభ్యులచే 10 వ సామూహిక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సాయీశ్వర మహాదేవుని కి నదీ జలములతో, పంచామృతాల తో, పంచ పండ్ల రసములతో, పంచద్రవ్యములతో,విభూతితో సుగంధ ద్రవ్యములతో అభిషేకం జరిగింది ఇందులో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణము, బిల్వాష్టకము, లింగాష్టకము, శ్రీ సూక్తము, పురుష సూక్త పారాయణము, శివోపాసన మంత్రం, మరియు మహాశివ లింగమునకు చక్కటి అలంకారం తో, సప్త హారతులు, భజన మరియు భగవాన్ బాబా వారికి మహా మంగళ హారతి తో వేడుక ముగించట మైనది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆనంద ఆధ్యాత్మిక కార్యక్రమమును మహాబాబా నగర్ జిల్లా లో గల జడ్చర్ల శ్రీ సత్యసాయి మందిరము లో వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉ"8:46 నుండి మధ్యాహ్నం 03:15 ని.ల"వరకు నిర్వహించ బడినది. ఇట్టి మహత్కార్యంలో రాష్ట్ర వేద సమన్వయకర్తలు శ్రీ పనీంద్ర గారు, తిరుపతి శ్రీ.హరి ప్రసాద్ గారు, శ్రీ గుబ్బా ఈశ్వరయ్య గారు,శ్రీ D. విష్ణు వర్ధన్ రావు గారు, వివిధ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు, సమితి కన్వీనర్లు ,భక్తులు రంగారెడ్డి జిల్లా SSSSO సమన్వయకర్తలు, వివిధ సమితుల కన్వీనర్లు, భక్తులు, సాయి కుటుంబ సభ్యులు మహిళలు, యువత అందరూ కలిసి సుమారు 500 మంది పైగా ప్రత్యక్షంగా అభిషేఖంలో పాల్గొన్నారు. మరియు ప్రతి ఒక్కరి భక్తులకు మహా ప్రసాదం అందించారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక అభిషేఖం లో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి పవిత్ర భక్తి హృదయాలతో స్వామి వారిని ప్రత్యక్షంగా అభిషేకించి శ్రీ సాయి మహాదేవ భగవానుని దివ్య కృపా కటాక్షమునకు, పాత్రులయ్యామని సంతోషం వ్యక్తపరిచారు.. ఎంతో సుదీర్ఘ రోజుల తర్వాత ఇంత చక్కటి ఆనంద వేడుక చేసుకోవడానికి అవకాశమిచ్చి, ప్రత్యక్ష అనుభూతి కలిగించి, విజయవంతము అందించిన మన బంగారు తండ్రి పరిపూర్ణావతారి,హృదయవాసి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద శ్రీ చరణములకు కృతజ్ఞతా పూర్వక అనంత కోటి వందనములు సమర్పించు కుంటున్నాము. ఈ చక్కటి వేడుక జడ్చర్ల సమితి సభ్యులు,జిల్లా అధ్యక్షులు శ్రీ.సాయిబాబు గారు, మందిరము సుందరంగా అలంకరణ,పూలు కుట్టడం, వంటలు ఏర్పాట్లు అన్నీ కూడా వారే స్వయంగా ఇష్టముతో, స్వామి వారిపై భక్తి,విశ్వాసముల తో కొద్దీ రోజుల వ్యవధిలోనే అన్నీ ఏర్పాట్లు చేసుకొని స్వామి వారు నచ్చేలా,మెచ్చేలా అందరూ ఐక్యతతో పాల్గొని ప్రేమావతారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపకు పాత్రులయ్యామని ఆనందం, సంతోషం వ్యక్తపరిచారు.. సమితి కన్వీనర్ ,సమన్వయ కర్తలు, మరియు ఇతర అందరు సభ్యులు, మహిళలు యువత, ఐక్యతతో స్వామి వారిని ఎలా మెప్పించాలి అనే తపన, తాపత్రయము, ఈ ఆనంద వేడుక విజయములో ముఖ్య పాత్ర పోషించారు. మందిరం,వేదిక, చక్కటి అలంకారంతో,చక్కటి ఏర్పాట్లు తో మరియు అందరి భక్తులకు మహా ప్రసాదముతో ఏర్పాట్లు చేసిన వారి అందరి సభ్యులు, వారి కుటుంభ సభ్యుల కు స్వామి వారి కృప,దయ అనుగ్రహ , ఆశీస్సులు దండిగా మెండుగా అందిస్తారని స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్థూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక శుభ వందనములు, సాయిరాం ఈ వచ్చే సెప్టెంబర్ 5 వ తేదీ అదివారం నాడు 11 వ రుద్రాభిషేఖము సూర్యాపేట జిల్లా భేథవోల్ సమితి మందిరం లో మళ్ళీ ఈ విధంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేఖము వేడుక చేసుకోవటం జరుగుతుంది. సాయిరాం సదా శ్రీ సాయి సేవలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా,తెలంగాణ