ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల పెళ్ళికి చేయూత భగవానుని దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల ఆధ్వర్యంలో ఈ రోజు ఒక పేద కుటుంబంలో యువతి పెళ్ళికి చేయూత అందచేయడం జరిగింది. స్థానిక జగిత్యాలలోని ధరూర్ కి చెందిన శ్రీ గుంటుక శంకర్ - లక్ష్మి గార్ల చిన్న కూతురు(వీరికి ముగ్గురు కూతుర్లు) రజిత వివాహం నిశ్చయమైంది, కానీ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడం వలన సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకుని ఈ రోజు సత్యసాయి సేవా సంస్థ, జగిత్యాల తరపున అమ్మాయికి ఒక పెళ్లి చీర , కన్యాదానం కలశం, తాంబోలం, స్టీల్ వంట సామాగ్రి, మరియు 25 kg ల బియ్యం అందచేయడం జరిగింది, అలాగే భవిష్యత్తులో కూడా వారికి తోడుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరిపై సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం