*మహాముత్తారం గ్రామ కరోనా బాధితులకు గుడిసెలపై తాటిపత్రి, బట్టలు, నెలకు సరిపడ కిరాణా సరుకులు అందించిన శ్రీ సత్యసాయి బాబా యువత* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా* *మహముత్తరాం దగ్గర మహబూబ్ పల్లి గ్రామం* *భూపాలపల్లి నుండి సుమారు 60కి.మి దూరంలో ఉన్న గ్రామంలో* *కరోనా మహమ్మారి కుటుంబం మోత్తాన్ని పొట్టన పెట్టుకున్న ఎటువంటి ఆధారం లేని* వృద్ధురాలిని రోడ్డున పడేసిన సంగతి *శ్రీ సత్యసాయి యువతకి తెలిసిన 24గం.ల లోపల బయలుదేరి అక్కడికి చేరుకొని* వారి పరిస్థితి చూసి కన్నీరు మున్నీరయ్యారు. కరోనా రావటంతో వారిని *గ్రామస్తులు ఎక్కడో ఊరిబయట, మురికి కాలువ గట్టున ఉంచిన తరుణంలో వారికి కరోనా తగ్గిన కూడా ఊరులోకి తీసుకురాలేదు అందుకని శ్రీ సత్యసాయి యువత వారితో చర్చించి వారిని వారి స్వంత గూటికి చేర్పించటంతో పాటుగా* వీరు ఉండే గుడిసెలో *కనీస వెలుతురు లేకుండా కరేంటు బలుబులు లేకుండా ఉండే గుడిసెలో..* *వర్షంలో తడుస్తూ..* *ఎండలో వేడికి ఉంటూ..* చివరికి వారు ఉండే గుడిసెలో *పాములు పుట్టలు పెట్టిన కూడా అక్కడే ఉండే పరిస్తితి...* *ఎవరు లేరు..* *కరోనా కాటుకి బలి అయ్యి..* *ఒంటరిని చేసి..* *ఏమి చేయలేని..* *ఎవరు ముందుకు రాని..* స్థితి వారిది కరోనా సోకి కుటుంబం కోల్పోయి ఊరు వారు దగ్గరికి చేర్చుకొలేని దీన పరిస్థితులలో *శ్రీ సత్య సాయి యువత అక్కడికి చేరి* *వారి గుడిసెలను శుభ్రం చేసి...* కాషాయ రంగులో ఉన్న తాటిపత్రితో వారి గుడిసెలను పూర్తిగా కప్పి..* *స్వామి వారి వస్త్రం వారికి రేపటి రోజున ఆస్త్రంగా సాయపడాలని ఆశిస్తూ* వారికి వంట సామాను, బట్టలు అమృత కలశం అందచేయటంతో *ఆ వృద్ధుల మనసులో అనందానికి అవదులు లేవు..* వారి గడ్డు పరిస్థితి చూసి సహాయం చేయుటకు వచ్చిన *శ్రీ సత్యసాయి యువతను మనసారా ఆశీర్వదించారు.* *అక్కడి గ్రామంలో యువత మరియు పెద్దలలో పాటుగా ప్రభుత్వ ఆధికారులు కూడా రాబోయే 10 రోజుల్లో అక్కడ ఉన్న మిగతా గుడిసెల్లో కూడా శుభ్రత కార్యక్రమం చేయుటకు సిద్దమవడం సంతోషకరం* భవిష్యత్తులో మరింత మంది నిరాశ్రయులకు శోబాయమానమైన, ఉన్నతమైన, సమున్నతమైన, సంపూర్ణ ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ.. శ్రీ సత్యసాయి యువతకి స్వామి వారి ఆశీస్సులు దండిగా వుండాలని మనసారా కోరుకుంటూ... Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *భూపాలపల్లి జయశంకర్ జిల్లా*