సాయిరాం.... *జప తప యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే అభివృద్ధి కేవలం నామస్మరణ తో కూడిన స్వచ్చమైన సేవతో జరుగుతుంది..* -sssspeaks 1985 తేది.22.06.2021 మంగళ వారం రోజున, భూపాలపల్లి కి సుమారు 45కి.మి దూరంలో ఉన్న శ్రీ సత్యసాయి భజనమండలి, చికెన్ పల్లి లో గత *6మాసాలుగా ఒక్కరూ కూడా పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి అవుతున్న 60 సంవత్సరాల అనాధ వ్యక్తి కి ఆరోగ్యం క్షీణించడం* వల్ల భజన మండలి కన్వీనర్ తెలియపరచిన వెంటనే బయలుదేరి అక్కడికి చేరుకొని వారిని *శుభ్రం చేసి బట్టలు మరియు భోజనం పండ్లు అందించటం చూసిన గ్రామస్తులు ఎంతో సంతోషిస్తు ఇటువంటి దీనజనుల సేవ చేయటం కేవలం శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు మాత్రమే సాధ్యం అని తెలపటం* *జరిగింది..* ఆ తర్వాత గ్రామస్తుల కొరకు, అందరికీ సబ్బులు మరియు కరోనా అవగాహన కల్పించటం జరిగింది... *ఈ Heartful సేవలో పాల్గొన్న యువ విభాగం ప్రతి సాయి సోదరులకు భగవానుని దివ్య ఆశీస్సులు దండిగా ఉండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ..* సదా సాయి సేవలో.... జై సాయిరాం *Ch మల్లా రెడ్డి* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *భూపాల పల్లి జయశంకర్ జిల్లా*