ఓం శ్రీ సాయిరాం *భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో* *కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న ఈ విపత్కర సమయంలో, మన శ్రీ సత్య సాయి సేవా సంస్థలు All India President వారి కార్యాలయం నుండి oxygen concentrator ను, స్థానిక భూపాలపల్లి పట్టణంలో ఉన్న Pradhan హాస్పిటల్ కు ,తేదీ 26-05-2021 బుధవారం రోజున ఉదయం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా వారిచే Dr.Pradhan గారికి , కరోనా వ్యాదిగ్రస్తుల కొరకై ఉచిత సేవల నిమిత్తమై అందించడం జరిగింది.* *ఇట్టి సేవను ఈ రోజునుండే ప్రారంభించి కరోనా రోగుల గురించి ఉపయోగించడం జరుగుతుంది.*ఆక్సీజన్ కోసం మంచి అరుదైన అవకాశం, ఉచితంగానే, అందరూ వినియోగం చేసుకోవచ్చు* ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా coordinators, సాయి యూత్ పాల్గొన్నారు. *మన భూపాల పల్లి జిల్లాకు ఇటువంటి ఉపయోగకరమైన అవకాశాన్ని కల్పించిన అఖిలభారత అధ్యక్షుల వారికి మరియు రాష్ట్ర అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని అందించి మరియు మన అందరిని సేవలో పాలు పంచుకొనేవిధంగా చేసిన మన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ...* సదా సాయి సేవలో *Ch మల్లా రెడ్డి* *జిల్లా అధ్యక్షులు* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా* *తెలంగాణ రాష్ట్రం*