Carona 2020




ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కోవిడ్ వ్యాధిగ్రస్తులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న ఈ సమయంలో,మన AIP వారి కార్యాలయం నుండి oxygen concentrator ను సిద్దిపేటలో ఉన్న ఆరోగ్య హాస్పిటల్ కు ,తేదీ 21-05-21 శుక్రవారం రోజున ఉదయం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్దిపేట జిల్లా వారిచే Dr. గణేష్ గారికి , కరోనా వ్యాదిగ్రస్తుల కొరకై ఉచిత సేవల నిమిత్తమై అందించడం జరిగింది. ఇట్టి సేవను ఈ రోజునుండే ప్రారంభించి కరోనా రోగుల గురించి ఉపయోగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదల్ కో-ఆర్డినేటర్, జిల్లా ఆధ్యాత్మిక కో-ఆర్డినేటర్,జిల్లా మహిళా కో-ఆర్డినేటర్ ,సమితి యూత్ కో-ఆర్డినేటర్ లు పాల్గొనడం జరిగింది. మా సిద్దిపేట జిల్లాకు ఇటువంటి ఉపయోగకరమైన అవకాశాన్ని కల్పించిన అఖిలభారత అధ్యక్షుల వారికి,మరియు రాష్ట్ర అధ్యక్షుల వారికి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ,ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని అందించి మరియు మన అందరిని సేవలో పాలు పంచుకొనేవిదంగా చేసిన ఆ భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ... జై సాయిరాంసదా సాయి సేవలో జిల్లా అధ్యక్షులు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా