ఓం శ్రీ సాయిరాంభగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద పద్మాలకు ప్రణమిల్లుతూ అందరికి సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి నిత్యాన్నప్రసాధ కేంద్రములో.... ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా..... కోవిడ్ సమయములో అద్భుతమైన సేవలందించిన ప్రభుత్వ ఆసుపత్రి మహిళా డాక్టర్స్ 4 గురుని సిస్టర్స్ 8 మందిని స్కేవెంజెర్స్ 8 మందిని కోవిడ్ సమయములో మనకు వంటకు సహకరించిన మహిళా సేవాదళ్ కు స్వామి ఆశీర్వాదంగా వారిని సత్కరించి స్వామి వారి చిత్రపటాలను విభూతి పాకెట్స్ , స్వీట్స్ , పండ్లు అందించటం జరిగింది ఒక మహిళా ముస్లిం డాక్టర్ శ్రీమతి గారు తన చిన్నప్పటి నుండి స్వామి సేవాకార్యక్రమాలు చూస్తున్నానని ,ఒకసారి శివం ఆధ్వర్యములో జరిగిన competitions కు వెళ్లాలని , పుట్టపర్తి కి వెళ్లి స్వామి ఆశిశులు తీసుకున్నానని ,సర్వమత సమ్మతమైన సాయి సంస్థ అంటే తనకు ఇష్టమని మీరు మమ్మల్ని మా సేవలను గుర్తించటమంటే స్వామీ వారే స్వయంగా ఆశీర్వదిస్తున్నారని సంతోషంగా ఉందని హర్షాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఇంటర్నేషనల్ సేవా సంస్థ అని ఈ రోజు మాకు స్వామి ఆశీర్వాదం దొరికినందుకు సంతోషమని అన్నారు. సిస్టర్స్ మాట్లాడుతూ మీరంతా కూడా కోవిడ్ సమయములో అన్నప్రసాదాన్నీ అందించటమే నిజమైన సేవ అని ఆనందాన్ని తెలియజేసారు ఈ కార్యక్రమములో సమితి కన్వీనర్ గారు, జిల్లా బాలవికాస్ కో ఆర్డినేటర్ , అన్న ప్రసాద సేవా కమిటీ సేవా దళ్, మహిళా సేవాదళ్ స్త్రీలు 13మంది పురుషులు 13 మంది పాల్గొన్నారు. జైసాయిరాం సదా సాయి సేవలో........ జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ భగవాన్ శ్రీ సత్యసాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రం, పెద్దపల్లి, పెద్దపల్లిజిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లిజిల్లా