🙏సాయిరాం అందరికీ, 🙏 స్వామివారి అనుగ్రహ ఆశిశులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి సేవా యూత్ టీమ్ RYC శ్రీ సందీప్ సింగ్ మరియు శ్రీ వి. ఉమా మహేశ్వర రావు, జిల్లా ఐ. టీ. ఇంఛార్జి ఆధ్వర్యంలో తేది.14.06.2020 ఆదివారం భూపాలపల్లి నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు బయలుదేరి బయ్యక్క పేటకి వెళ్లి తిరిగి అక్కడి నుండి 5కి.మీ ట్రాక్టర్ ద్వారా తర్వాత నడక ద్వారా వెళ్లి సారక్క పల్లె గ్రామం చేరుకొని అక్కడిగిరిజన ఆదివాసి బాల బాలికలకు ఒంటిపై బట్టలు/ దుస్తులు లేని వారి దీన స్థితిని మన సాయినాథ భగవానుడు అనుగ్రహించిన అవకాశంగా సేవలను అందించడం జరిగింది. 1) 50 మంది పిల్లలకు నూతన జత దుస్తులను స్వామి కానుకగా ఇవ్వడం 2) శ్రీ సాయి ప్రోటీన్-50 మందికి అందివ్వడం 3) ఐదు డజన్ల అరటి పండ్లు, చాకిలెట్లు ఇవ్వడం 4) ఇంకా, ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్, భూపాలపల్లి వారి సూచనల మేరకు శ్రీ సాయి ప్రోటీన్ ఫుడ్ శంపుల్ ను చూపించి, వారి ద్వారా Albendazone మందులను (నట్టలు నివారించేందుకు) సేకరించి ముందుగా ఈ బాల బాలికలకు ఇవ్వడం జరిగింది. 5) తర్వాత పిల్లలందరికీ నెయిల్ కట్టర్ తో గోర్లు తగ్గించడం జరిగింది. 6) అలాగే మన జిల్లా మెడికల్ ఇంఛార్జి శ్రీ V Ravinder గారి నిర్వహణ లో ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు మరియు సూచనలు వివరంగా తెలియ జేసి, పిల్లలకు మరియు పెద్దలకు మొత్తం 80మందికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను కూడా ఇవ్వడం జరిగింది. 7) 30 మంది పురుషలకు లుంగిలను, తువాలను 8) 30 మంది మహిళలకు చీరలను, 9) ఇవే కాక అందరికీ పాత దుస్తులను ఇవ్వడం జరిగిందని సంతోషంగా తెలియ జేస్తూ.... ఈ సేవా కార్యక్రమాల లో జిల్లా కోఆర్డినేటర్లు, సమితి కోఆర్డినేటర్లు, సాయి సేవా యూత్ టీమ్ వారు మొత్తం15 మంది పాల్గొని , సేవా కార్యక్రమాలని విజయవంతం చేసి రాత్రి 9.00 గంటలకు భూపాలపల్లి తిరుగు ప్రయాణం అయినరని సంతోషంగా తెలియజేస్తూ, మన స్వామి వారి కృప దండిగా వీరందరికీ వుండాలని స్వామి వారిని ప్రార్థిస్తూ.... జయహో శ్రీ సత్య సాయి సేవా యూత్ టీమ్ భూపాలపల్లి సభ్యలందరికీ...... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా