ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 22/11/2019 శుక్రవారం సాయంత్రం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం,ఖమ్మం సత్యసాయి నగర్ ( శ్రీనివాసనగర్) లోని సత్యసాయి మందిరంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించ బడినది. ఇట్టి దివ్య కల్యాణ మహోత్సవంలో స్వామి అనుగ్రహముతో వధువుల తరపున కన్యా దాతలుగా శ్రీ బులుసు సాంబమూర్తి స్టేట్ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గారు, శ్రీమతి రాజేశ్వరి దంపతులు మరియు శ్రీ టి సాయిసుధాకర్ గారు శ్రీమతి సురేఖ దంపతులు వరుని తరపున శ్రీ చెరుకూరి శంకరనారాయణ గారు శ్రీమతి సువర్ణ దంపతులు పాల్గొన్నారు. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కల్యాణ మహోత్సవం ఆనందంగా అంగరంగ వైభవంగా జరిగింది..భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..