ఓం శ్రీసాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - వనపర్తి జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా తేది: 21/03/2019 గురువారము నాడు శ్రీ రంగాపూర్ భజన మండలి ప్రారంభోత్సవ కార్యక్రమంనిర్వహించడము జరిగింది. ఇట్టి కార్యక్రమ వివరాలు: నగర సంకీర్తన, భజన, సాయి వ్రతం, పల్లకి సేవ.చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, క్రృష్ణ కుమార్ గారు, రాష్ట్ర గ్రామ సేవా మహాయజ్ఞము సమన్వయ కర్త విష్ణువర్దన్ రావు గారు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాదికారులు, జిల్లాలోని అన్ని సమితి కన్వీనర్లు, సమితి పదాదికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. జై సాయిరాం.