Pujas & Vrathams
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , ఖమ్మం జిల్లా 🌻🌻 శ్రీ సత్యసాయిశ్వరుని శత జయంతి వేడుకలను విశ్వ వ్యాప్తంగా సాయి భక్తులు ఆనందోత్సాహాలతో జరుపు కుంటున్న శుభవేళ ... అనేక సంవత్సరాలుగా వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న VM బంజర భజన మండలి, VM బంజర గ్రామంలో స్వామి వారి కృపతో.. ఆర్యవైశ్య కళ్యాణ మండపం VM బంజర వేదికగా తేదీ 26/10/2025 ఉదయం 9- 00 లకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు (శ్రీ సత్యసాయి వేద పాఠశాల, వైరా వేద పండితులచే) ఘనంగా జరిగాయి. విశిష్ఠ అతిథి పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, శ్రీ సత్యసాయి ధ్యానమండలి వారి ప్రసంగం అద్భుతంగా సాగింది. శ్రీ D సుధాకర రావు గారు జిల్లా అద్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలుఖమ్మం జిల్లా వారు ఖమ్మం జిల్లా లో స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సంకల్పించుకున్న, జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వివరించారు.. జిల్లా కార్యవర్గ సభ్యులు, సత్తుపల్లి సమితి సభ్యులు, VM బంజర భజన మండలి సభ్యులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరైనారు. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా