Service
🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్తుపల్లి సమితి మహిళా విభాగం ఆధ్వర్యములో గత రెండు సంవత్సరములుగా గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో ప్రతీనెలా రెండవ గురువారం గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేయబడుచున్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో (09 అక్టోబర్ 2025) గురువారం ఉదయం 11:00 గంటలకు గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ పంపిణీ చేయబడింది. ఈ సందర్భంగా డాక్టర్ గారికి మరియు మహిళా వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా విభాగ కోఆర్డినేటర్, సత్తుపల్లి సమితి కార్యవర్గ సభ్యులు, బాలవికాస్ గురువులు, సాయి యూత్ సభ్యులు, సాయి డివోటీస్, యాక్టివ్ సభ్యులు, సేవాదళ్ సభ్యులు తదితరులు ప్రేమతో పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా