Special Programs
🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో........ తేది: 24 ఆగష్టు 2025 (ఆదివారం) సత్తుపల్లి సమితి గ్రామమైన గౌరిగూడెం శ్రీ సీతారామాలయ ప్రాగణంలో "శ్రీ సత్యసాయి గ్రామోత్సవ సంబరాలు" అత్యంత వైభవంగా కనులపండుగగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతా రామలయ ప్రాంగణంలో సమితివారిచే నిర్మింప బడిన "నీటి సంప్ మరియు నీటి ట్యాంక్" ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారు, పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, యూత్ విభాగం సభ్యులు సీనియర్ డిఓటీస్,బాల వికాస్ గురువులు, బాల వికాస్ చిన్నారులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓమ్ శ్రీ సాయిరామ్🙏