Special Programs
🙏ఓమ్ శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో........ తేది: 24 ఆగష్టు 2025 (ఆదివారం) సత్తుపల్లి సమితి దత్తత గ్రామమైన గౌరిగూడెం శ్రీ సీతారామాలయ ప్రాగణంలో "శ్రీ సత్యసాయి గ్రామోత్సవ సంబరాలు" అత్యంత వైభవంగా కనులపండుగగా నిర్వహించబడినవి. *ఉదయం 5:00 గంటలకు తోరణములతో అలంకరించబడిన ఆలయ ప్రాంగణములో "నగరసంకీర్తన"తో ప్రారంభమైన గ్రామోత్సవ సంబరాలు *గ్రామ చిన్నారులకు మరియు మహిళలకు గేమ్స్, ముగ్గుల పోటీలు, విచిత్ర వేషధారణ పోటీలు, బహుమతి ప్రధానాలు. *ఆలయ ప్రాంగణములో సమితివారిచే నిర్మింప చేయబడిన "నీటి సంప్ మరియు నీటి ట్యాంక్" ప్రారంభోత్సవం. *గ్రామ సేవకులకు, ఉపాధ్యాయులకు, కళాకారులకు మరియు గ్రామ పెద్దలకు సన్మానాలు. *అమృత కళశముల పంపిణీ, నారాయణసేవ, అన్నప్రసాద వితరణ. *గ్రామ యువతచే "గ్రామసేవ" మరియు "శ్రీ సత్యసాయి ప్రేమతరు" (మొక్కలునాటుట). *వేద పండితులచే మాతృపూజలు, "ఇంటింటా సాయి-ప్రతి ఇంటా సాయి"(స్వామివారి చిత్రపటముల పంపిణి). *పల్లకిసేవ, కోలాటములు, భజనలతో అంగరంగ వైభవముగా కొనసాగి...సాయంత్రం 6:00 గంటలకు "మహా మంగళ హారతి", "ప్రసాదవితరణ"తో ముగిసినవి. ఈ సంబరాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారు, పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, యూత్ విభాగం సభ్యులు సీనియర్ డిఓటీస్,బాల వికాస్ గురువులు, బాల వికాస్ చిన్నారులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓమ్ శ్రీ సాయిరామ్🙏