Bhajans
Om sri Sairam భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 98వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్య సాయి సేవా సమితి సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో 10/11/2023 శుక్రవారం నాడు స్వామి వారి 98వ భజన సత్తుపల్లి లో శ్రీ చెల్ది శివాజీ గారు శ్రీమతి అనూరాధ దంపతుల స్వగృహంలో అత్యంత వైభవంగా జరిగింది.. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 11.00 గంటలకు జ్యోతి ప్రజ్వలన, వేదపఠనం తొ ప్రారంభమై, 12.00 గంటలకు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగి సహాయకులకు అన్నప్రసాద వితరణ, రోగులకు పండ్లు మరియు బ్రెడ్స్ పంపిణీ జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు స్వామి వారి భజన అనంతరం, శ్రీ సత్యసాయి వేద పాఠశాల వైరా, గురువు గారు మరియు వేద విద్యార్థులచే శ్రీ సాయిగాయత్రి హోమం నిర్వహించారు.. వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇవ్వబడింది.. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం ప్రేమతో నిర్వహించబడింది.. స్వామి వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమాలు ముగిశాయి. ఈకార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, పలువురు ప్రముఖులు, సత్తుపల్లి సమితి కన్వీనర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు, బాలవికాస్ గురువులు, విద్యార్థులు యూత్ సభ్యులు మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా