Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామివారి 98వ జన్మదినోత్స శుభ సందర్భంగా జరుగు సేవా కార్యక్రమాలలో బాగంగా 13/10/2023 శుక్రవారం రోజున సత్తుపల్లి సమితిలోని పెనుబల్లి భజన మండలి పరిధిలో గల ఏరుగట్ల గ్రామంలో ▶️ఉదయం వెటర్నరీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు వైద్యురాలు మరియు జిల్లా మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ Dr ఉమాకుమారి గారు పశువులకు అవసరమైన సేవలు ప్రేమతో అందించారు.. ▶️ తదుపరి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల గురించి జిల్లా రైతు కోఆర్డినేటర్ శ్రీ K వెంకట్రామిరెడ్డి గారు వివరించారు ▶️ గోమాత విశిష్టత గురించి శ్రీ రమేష్ గారు విపులంగా తెలియజేశారు. ▶️తదనంతరం శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారు మానవతా విలువల గురించి, నిస్వార్థ సేవా కార్యక్రమాల గురించి ప్రసంగించారు.. ఈ యొక్క కార్యక్రమంలో , జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ కె భాస్కర్ రావు గారు, శ్రీ వేదమూర్తి గారు , సత్తుపల్లి సమితి కార్యవర్గ సభ్యులు, డిఓటిస్, ఏరుగట్ల గ్రామస్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు... సాయిరాం_ 🙏_ జిల్లా ఆఫీస్ ఇంచార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా