ఓం శ్రీ సాయిరాం🕉️ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸 సనాతన సారథి *౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼* పేరు. : మల్లారెడ్డి వయసు. : 70 సంవత్సరాలు గ్రామం : హబ్సిపూర్(సుమారు 600 గృహములుగల గ్రామము, మ" దుబ్బాక విద్యాహర్హత: HSC వృత్తి : దిన కూలి మల్లారెడ్డి గారు గత రెండు సంవత్సరాలుగా 168 మంది సభ్యులను చందా దారులుగా చేర్పించి సనాతన సారథి పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది, తనే స్వయంగా వారి వారి గృహాలకు వెళ్లి చదివి వినిపించి చందాదారులుగా చేర్పించడం గమనార్హం. ఈ గ్రామంలో సుమారు 600 గృహాలు ఉన్నవి,ప్రతి వారం కూడా భజన కార్యక్రమాన్ని నిర్వహిచుకోవడం జరుగుతుంది ,తదనంతరం సత్సంగం ఏర్పాటుచేసుకొని అందులో సనాతన సారథి పుస్తకాలను చదివి వినిపించడం జరుగుతుంది. స్వామి వారి అనుగ్రహంతో మల్లారెడ్డి గారు ఇట్టి నిస్వార్థ సేవలో పాల్గొంటున్నారు అంతే కాకుండా 2023, ఎప్రిల్ ప్రశాంతి సేవలకు కుటుంబ సభ్యులు హాజరు కావడం అభినందనీయం. మనమందరం కూడా తనను ఆదర్శంగా తీసుకొని , వీలైనంత మంది సభ్యులను చందాదారులుగా చేర్పించి స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొంది పునీతులమౌదాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం 🙏 జై సాయిరాం....