🙏శ్రీ సాయిరాం 🙏 భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో... . తేదీ:19-03-2023 ఆదివారం న యాదాద్రి భువనగిరి జిల్లా యువజన విభాగం వారి ఆధ్వర్యంలో రెండు మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి సమితిలో 35 మంది విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలో టిప్స్ ని వివరించడం జరిగింది. అదేవిధంగా రాజాపేటలో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో 150 మంది విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి ఎగ్జామ్స్ టిప్స్ తెలియజేసి, ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో అన్ని వివరాలు మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ A. నగేష్ రెడ్డి గారు విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు 130 ఎగ్జామ్ ప్యాడ్లు లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ ఎన్. నాగరాజు గారు సమితి మరియు జిల్లా బాధ్యులు ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. సదా స్వామి సేవలో ... యువజన విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు యాదాద్రి భువనగిరి జిల్లా.