ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా * భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97 వ జయంతి మహోత్సవాలు శుభ సందర్బంగా ఈ రోజు 23/11/2022 బుధవారం నాడు ఉదయం 9.00 గంటల నుండి ఖమ్మం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణంలో శ్రీ సాయి గాయత్రి హోమం, ఆయుష్షు హోమం మరియు మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా జరిగాయి.. శ్రీ బులుసు సాంబమూర్తి గారు, శ్రీ మాదిరాజు రామచంద్రరావు గారు, సమితి కన్వీనర్ గారు, పలువురు ప్రముఖులు, భక్తులు, శ్రీ సత్యసాయి నగర్ వాసులు, ఇతర ప్రాంతాల ప్రజలు అత్యధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.. స్వామి వారికి మహా మంగళహారతి సమర్పణ అనంతరం అందరికి మహాప్రసాదం వితరణ జరిగింది. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా