ఓం శ్రీ సాయిరాం 🌹 🕉️భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ❤️ 🔅రక్తదాన శిబిరం- శ్రీ సత్యసాయి సేవాసంస్థలు,వికారాబాద్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్ లో స్వామి 97వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు 26వ తేదీ శనివారము ఉదయం 10:30 ని|| ల నుండి సద్గురు సాయిరాం హాస్పిటల్ బస్టాండ్ దగ్గర జిల్లాస్థాయి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది . ఈ శిబిరంలో సుమారుగా 80మంది వరకు యువత పాల్గొన్నారు, ఇందులో 22 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీజ, పి ఆర్ ఓ మొగులప్ప, స్టాఫ్, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణగౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదారం వెంకటరెడ్డి , డివైసీ బసవేశ్వర్, వేణుగోపాల్,రామచంద్రయ్య, సత్యనారాయణ, ప్రవీణ్, జిల్లా సాయి యువత పాల్గొన్నారు. 🔅 స్వామివారి దయతో ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేసిన వారికి,పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ 🔅 🪷సదా సాయి సేవలో🪷 యువజన విభాగం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వికారాబాద్ జిల్లా