ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సమితి, మిర్యాలగూడ స్వామి వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి బందువులందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 97వ దివ్య జన్మదినోత్సవ వేడుకలు లో ఈరోజు 23.11.2022 బుధవారం మన మందిరములో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 4.45 ని.లకు ఓంకారం, సుప్రభాతము, పాదుకాభిషేకము, నగర సంకీర్తన, పల్లకి సేవతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. తదనంతరం మందిరములో 471నారాయణులకు దుప్పట్లు, నారాయణ సేవ చేయడం జరిగినది. సాయంత్రం 5.30 గంటలకు మందిరములో సాయంకాలం కార్యక్రమాలు వేదపఠనము, భజనలతో ప్రారంభించబడ్డాయి. సాయంత్రం 6.30 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేయగా, 6.40 నిమిషాలకు కన్వీనర్ గారు సమితి వార్షిక నివేదిక సమర్పించారు. సాయంత్రం 7.00 గంటలకు బాలవికాస్ విద్యార్థులచే స్వామి వారి జన్మదినోత్సవ కేక్ కట్ చేయించడం జరిగింది. తదుపరి ఆధ్యాత్మిక ప్రసంగాలు, బాలవికాస్ పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, తదుపరి స్వామివారికి ఉయ్యాల సేవ, మహా మంగళ హారతితో నేటి కార్యక్రమాలు ముగిసాయి. సదా సాయి సేవలో, కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, మిర్యాలగూడ.