ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా * భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97 వ జయంతి మహోత్సవాలు శుభ సందర్బంగా 22/11/2022 మంగళవారం నాడు సాయంత్రం 6.30 గంటలనుండి ఖమ్మం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిర ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం(శాంతి కల్యాణం) అంగరంగ వైభవంగా జరిగింది..వరుడు శ్రీ శ్రీనివాసుని తరపున శ్రీ తాళ్లూరి వెంకటేశ్వర రావు గారు శ్రీమతి ఉమాదేవి దంపతులు, మరియు శ్రీదేవి , భూదేవి కన్యాదాతలుగా శ్రీ ఆలిస్యం నరసింహారావు గారు శ్రీమతి కుమారి దంపతులు భక్తి శ్రద్ధలతో వ్యవహరించారు.. బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తంగా శ్రీ శ్రీనివాసకల్యాణం కమనీయంగా నిర్వహించారు.. భక్తులు ఆనందోత్సాలతో, భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. శ్రీ బులుసు సాంబమూర్తి గారు స్వామి వారికి హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా