ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 28-07-22 గురువారం రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి బూరుగుపల్లి వారు స్థానిక పాఠశాల మరియు దాచారం పాఠశాల విద్యార్థులకు , బూరుగుపల్లి పాఠశాల వేదికగా ఉచిత మొబైల్ దంత వైద్య శిబిరం ఉదయం 10:00 గం" నుండి సాయంత్రం 3:00 గంటల వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 192 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 87 మంది విద్యార్థులకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. విద్యార్థులకు బాలవికాస్ తరగతులను తీసుకోవడం జరిగింది. ▪️ఇట్టి ఉచిత దంత వైద్య శిబిరంలో జిల్లా అధ్యక్షులు , జిల్లా మహిళా యూత్ కో-ఆర్డినేటర్ ,సమితి కన్వీనర్స్ ,బాలవికాస్ గురువులు,సేవాదళ్ సభ్యులు ,పాఠశాల ఆధ్యాపక బృందం, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న సాయి సాధకులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతు,ఆ భగవానుని కృపా కటాక్షాలు సర్వదా మన అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ....సాయిరాం. 🙏 జై సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సిద్దిపేట జిల్లా