ఓం శ్రీ సాయిరాం, శ్రీ సత్యసాయి బాబావారి 96వ పుట్టుపండగా వేడుకలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లాలో తేదీ 19.11.2021 మహిళా డే సందర్భముగా జరిగిన కార్యక్రమ వివరాలు, 1) హాస్పిటల్ నందు అల్పాహారం పంపిణీ: శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని (8incline colony) మహిళా విభాగం వారిచే గోదావరిఖని ప్రభ్యత్వ హాస్పటల్ నందు రోగుల సహాయకులు ఉ.8:00 నుండి 9:00 గం.ల వరకు 120 మందికి అల్పాహారము అందించినము. ఈ కార్యక్రమంలో 5గురు స్త్రీలు, 5గురు పురుషులు పాల్గొన్నారు. సా. 7:00 భజన మంగళ హారతితో ముగించుకున్నాము. 2) ఉసిరి చేట్టు పూజ, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, లలితా సహస్త్రనామ పారాయణము : శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్దపల్లి ఉ. 10:00 గం.లకు ఉసిరి చేట్టు పూజ, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు అనంతరం ప్రసాద పంపిణీ, సా.6:00 గం. లకు లలిత సహస్త్రనామ పారాయణము అనంతరం భజన మంగళ హారతి. ఈ కార్యక్రమములో 15 స్త్రీలు, పురుషులు 10, పిల్లలు 11మంది పాల్గొన్నారు. 3) చీరల పంపిణీ : శ్రీ సత్యసాయి సేవా సమితి బసంత్ నగర్ నందు ఉ. 10.30 గం. లకు 20 మంది బీద మహిళలకు ఇంటింటికి వెళ్లి 20 చీరలు పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో 4గురు సేవాదల్ పాల్గొన్నారు. 4) ప్రభుత్వ హాస్పిటల్ నందు పాలు పండ్లు పంపిణీ, కేక్ కటింగ్: శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉ.10.30గం. లకు అనారోగ్యులకి పాలు, పండ్లు పంపిణీ చేసినాము. అనంతరము స్వామివారి బర్త్ డే కేక్ కటింగ్ చేసుకున్నాము. సా.6:30 గం.లకు లలితా సహస్త్రనామ పారాయణం, భజన మంగళ హారతితో ముగించుకున్నాము. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారి అందరిపై స్వామివారు ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ.. సదా సాయి సేవలో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - పెద్దపల్లి జిల్లా