ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా ప్రారంభించుకొన్న వారోత్సవాలలో,ఖమ్మం సత్యసాయి నగర్ లోని శ్రీ సత్యసాయి మందిర ప్రాంగణంలో 16వ తేదీనుండి లక్మి గణపతి హోమం, సుదర్శన హోమం, రుద్రహోమం, లలిత హోమం, రాజశ్యామల హోమము, అఘోర పాశుపత హోమము, ప్రత్యంగిరా హోమము,చండీ హోమము 22వ తేదీ వరకు దిగ్విజయంగా నిర్వహించుకొని 23 వ తేదీన స్వామి వారి జయంతోత్సవం రోజు పాదుకా మహోత్సవం తరువాత మహా పూర్ణాహుతి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించ బడింది. మందిర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని కళకళ లాడింది.. సమితి నిర్వాహకులు, సభ్యులు, సేవాదల్ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు పూర్తిగా సహకరిస్తూ ప్రేమపూర్వక సేవలు అందించారు