🌸 ఓం శ్రీ సాయిరాం🌸 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు చే 28.04.2019 నుండి 06.05.2019 వరకు శ్రీ సత్యసాయి బాలవికాస్ వేసవి శిక్షణా తరగతులను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించడం జరిగింది. 04.05.2019 నుండి 06.05.2019 వరకు జిల్లాలో ని అన్ని భజన మండలి ల బాలవికాస్ పిల్లల తో పాటు లోకల్ బాలవికాస్ పిల్లల కు రెసిడెన్షియల్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు 🌷ఈశ్వరమ్మ డే 🌷ని బాల వికాస్ చిన్నారులచే ఎంతో వైభవంగా, ఓంకారము, సుప్రభాతం మరియు మహా ర్యాలీ నిర్వహించి, 21 మంది మాతలు మాతృపూజలో పాల్గొన్నారు. భూపాలపల్లి వివిధ భజన మండలి ల నుంచి 32 మంది బాలురు, 30 మంది బాలికలు పాల్గొన్నారు. వీరికి శ్లోకాలు, నీతి వాక్య విభూతి, రామాయణం, భాగవతం లపై అవగాహన కల్పించి 👉 క్విజ్ పోటీలను 👉డ్రాయింగ్ పోటీలను 👉శ్లోకాలు 👉 డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించుకుని పోటీలో గెలుపొందిన బాలవికాస్ చిన్నారులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అలాగే all participants కి గ్రూపు - 1 బాలవికాస్ హాండ్ బుక్ ని యివ్వడం జరిగింది, తదనంతరం హారతితో విభూతి ప్రసాదం వితరణ కార్యక్రమం ముగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస్ గురువులు - 2 మరియు ఆఫీస్ బేరర్లు మరియు తల్లిదండ్రులు, సాయి యూత్ total గా 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా