ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య ఆశీస్సులతో స్వామి వారు సమస్త మానవాళికి అండగా దండగ ఉంటూ ఈ మహమ్మారి కరోనా నుండి బయటపడేయాలని కోరుకుంటూ... *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా* *యువ విభాగం వారిచే* తేదీ 1/05/2021 శనివారం రోజున సాయంత్రం *భూపాలపల్లి మరియు సమీప ప్రాంతాలలోని* *కనీసం మాస్కు కూడా కొనడానికి వీలు లేని రోజు వారీ కూలీలకు* ఎంపిక చేసుకొని సుమారు *108 మందికి* *మాస్క్, మరియు 4 జతల ఆయుష్ సబ్బులు,హ్యాండ్ వాష్ లు* అందించడంతో పాటుగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుటకు కారణం అయిన *కరోనా గురించి* తీసుకోవలసిన తగు *జాగ్రత్తలు,సలహాలు,సూచనలు మరియు చేయవలసినవి చేయకూడనివి తెలుపుటతో పాటుగా కరోనాని ఎదుర్కొనుటకు కావాల్సిన ఆహారపు అలవాట్లు మరియు మనోధైర్యం గూర్చి* తెలపటం కోసం కేవలం *ముగ్గురు యువ సేవాదళ్ తో మాత్రమే నిర్వహించటంతో* పాటుగా *ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరికీ తాకకుండా సామాజిక దూరం పాటిస్తూ అతి కొద్ది మంది మాస్క్ ధరించటం తెలియని వారికి మాత్రమే తగు జాగ్రతలు తీసుకొని వారికి ధరించి చూపటం జరిగింది.* *ఇటువంటి గడ్డు పరిస్థితులలో కూడా వచ్చి సేవ చేయటం అనేది కేవలం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వారికే సాధ్యమవతుందనీ వారు తమ ఆనందం వ్యక్త పరచటం సంతోషకరం గా భావిస్తూ...* జై సాయిరాం *యువ విభాగం* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *జయశంకర్ భూపాలపల్లి జిల్లా*